మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
విశాఖ లీగల్: మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం వెరసీ మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో విశాఖ జిల్లా న్యాయవాదుల సంఘం, విశాఖ మహిళా న్యాయ వాదుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ క్యాన్సర్ పరిశోధన వైద్య సేవా కేంద్రం నిర్వహించిన మహిళా క్యాన్సర్ ప్రాథమిక పరీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ నేడు మహిళలు పు రుషులతో పాటు సమానంగా పనిచేయడం, కుటుంబ నిర్వహణ సమర్థవంతంగా చేస్తున్నారన్నారు. క్యాన్సర్ పరిశోధన చికి త్స కేంద్రం ప్రధాన వైద్యుడు వి.ప్రవీణ మా ట్లాడుతూ మహిళలు బెస్ట్ క్యాన్సర్ విషయంలో అప్రమత్తత అవసరమన్నారు. మహిళా న్యాయవాదుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు అనురాధ మాట్లాడుతూ నిర్లక్ష్యం వహిస్తే నిండు ప్రాణానికే ముప్పుగలిగే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. మెట్రోపాలిటీ సెషన్స్ జడ్జి ఎం.వెంకటరమణ, కేంద్ర నేర అన్వేషణ ప్రత్యేక న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జి.గాయత్రి, న్యాయవాదుల సంఘం కార్యదర్శి డి,నరేష్, సీనియర్ న్యాయవాదులు లక్ష్మీ రాంబాబు, హేమమాలిని, న్యాయవాదులు పాల్గొన్నారు. డాక్టర్ సుభద్ర దేవి తదితరులు వైద్య సేవలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment