మెట్రో కెమ్ పరిశ్రమలో ప్రమాదం
పరవాడ: పరవాడ ఫార్మాసిటీలోని మెట్రో కెమ్ ఏపీఐ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి 9.10 గంటల సమయంలో ఏ– బ్లాక్లో కెమికల్ రియాక్షన్ వల్ల మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న కార్మికులు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ సత్యనారాయణ, సీఐ ఆర్.మల్లికార్జున రావు ప్రమాద స్థలానికి చేరుకొని పరిశీలించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రమాద ఘటనపై అరా తీశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసు అధికారులు వెల్లడించారు. పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కెమికల్ రియాక్షన్ వల్ల చెలరేగిన మంటలు
మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment