పంచారామాలకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

పంచారామాలకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు

Published Mon, Nov 4 2024 1:05 AM | Last Updated on Mon, Nov 4 2024 1:05 AM

పంచారామాలకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు

పంచారామాలకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు

డాబాగార్డెన్స్‌: కార్తీక మాసంలో ఒక్క రోజులో పంచారామాలు దర్శనం చేసేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించింది. ద్వారకా బస్‌స్టేషన్‌ నుంచి ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు బయలుదేరింది. పంచారామాలను దర్శంచుకునే భక్తుల కోసం ఆదివారాల్లో ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు తెలిపారు. సూపర్‌ లగ్జరీ ప్రయాణ చార్జీ రూ.2,150, అల్ట్రా డీలక్స్‌ ప్రయాణ చార్జీ రూ.2,100గా నిర్ణయించామన్నారు. పంచారామాలను దర్శించుకునే భక్తులు www. apsrtconline. in ద్వారా ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. రిజర్వేషన్‌ కౌంటర్‌ వద్ద కూడా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు 99592 25602, 90522 27083లో సంప్రదించాలని ఆయన సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement