శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు | - | Sakshi
Sakshi News home page

శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

Published Sun, Nov 24 2024 3:44 PM | Last Updated on Sun, Nov 24 2024 3:44 PM

శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

డాబాగార్డెన్స్‌: అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. 5, 6, 7 రోజుల శబరిమల ప్యాకేజీని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు ప్రకటించారు. అయ్యప్ప మాలధారుల కోసం ఇంద్ర, సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్‌ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని శబరిమల యాత్రికులు వినియోగించుకోవాలని కోరారు. విశాఖ జిల్లా నుంచే కాకుండా ఒడిశాలోని నౌరంగపూర్‌, కోరాపుట్‌, జైపూర్‌ ప్రాంతాల నుంచి కూడా శబరిమలకు బస్సులు బయలుదేరుతాయని చెప్పారు.

ఐదు రోజుల యాత్ర

విశాఖలో బస్సు బయలుదేరి విజయవాడ, మేల్‌ మరవత్తూర్‌, ఎరుమేలి, పంబ మీదుగా సన్నిధానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, విజయవాడ మీదుగా విశాఖపట్నం చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ప్రయాణ చార్జీలు( సూపర్‌ లగ్జరీ) ఒక్కరికి రూ.6,600.

ఆరు రోజుల యాత్ర

విశాఖలో బస్సు బయలుదేరి విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవాని, పళని, ఎరుమేళి, పంబ మీదుగా సన్నిధానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, అన్నవరం మీదుగా విశాఖపట్నం చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ప్రయాణ చార్జీ(సూపర్‌ లగ్జరీ)లు ఒక్కరికి రూ.7వేలు.

ఏడు రోజుల యాత్ర

విశాఖలో బస్సు బయలుదేరి విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవాని, పళని, ఎరుమేలి, పంబ మీదుగా సన్నిధానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధురై, రామేశ్వరం, తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, ద్వారపూడి, అన్నవరం మీదుగా విశాఖపట్నం చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ప్రయాణ చార్జీ(సూపర్‌ లగ్జరీ)లు ఒక్కరికి రూ.7,600.

ఎవరిని సంప్రదించాలి?

విశాఖ డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌(ట్రాఫిక్‌) 90522 27083

విశాఖ డిపో మేనేజర్‌ 99592 25594

ద్వారకా బస్టేషన్‌ ఏటీఎం 91001 09731

కోఆర్డినేటర్‌ పీవీఎన్‌ రావు 73829 14219

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement