సింహాచలంలో జల ధారలు సంరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

సింహాచలంలో జల ధారలు సంరక్షించాలి

Published Sun, Nov 24 2024 3:44 PM | Last Updated on Sun, Nov 24 2024 3:44 PM

సింహాచలంలో జల ధారలు సంరక్షించాలి

సింహాచలంలో జల ధారలు సంరక్షించాలి

విశాఖ సిటీ: సింహాచలంలో సహజ సిద్ధ జలధారల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్‌ పేర్కొన్నారు. శనివారం వీఎంఆర్‌డీఏ సమావేశ మందరింలో సింహాచలం కొండ శ్రేణుల్లో జలధారల పరిరక్షణపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జలధారల పరిరక్షణకు సంబంధించి ధాన్‌ ఫౌండేషన్‌తో వీఎంఆర్‌డీఏ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అనంతరం కమిషనర్‌ విశ్వనాథన్‌ మాట్లాడుతూ సుస్థిర పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ధాన్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి లోకేష్‌ మాట్లాడుతూ సింహాచలం కొండ ప్రాంతాల్లో 34 జలధారల్లో 18 ధారలను మ్యాపింగ్‌ చేసినట్లు చెప్పారు. ఇంకా నీటి వనరులు గుర్తించేందుకు స్థానిక గిరిజన వర్గాల సహకారాన్ని తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు మాట్లాడుతూ ఆలయ ఆచారాలతో పాటు పర్యావరణానికి ఈ జలధారలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని వివరించారు. ఆలయ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఈ ధారలను సంరక్షించుకోవడం చాలా అవసరమని చెప్పారు. ఇందుకోసం ముందుకొచ్చే సంస్థలతో పనిచేయడానికి దేవస్థానం సిద్ధం ఉందని స్పష్టం చేశారు. ఈ జలధారల సంరక్షణపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని వర్క్‌షాప్‌లో నిర్ణయించారు.

ధాన్‌ ఫౌండేషన్‌తో వీఎంఆర్‌డీ ఒప్పందం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement