వదలని వర్షం.. స్తంభించిన జనజీవనం
మహారాణిపేట: జిల్లాలో శుక్రవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గడిచిన 24 గంటల్లో భీమునిపట్నంలో 42 మి.మీ, కాపులుప్పాడలో 39, గంభీరం, మారికవలస, మధురవాడలో 38, పరదేశీపాలెం, మదీనాబాగ్‌లో 37, ఎండాడలో 36, పెదగంట్యాడలో 35, గాజువాకలో 34, సింహాచలంలో 28, ఆరిలోవలో 27, వీఎంఆర్డీఏ పార్కు ప్రాంతంలో, ఎంవీపీ సర్కిల్‌లో 26 మి.మీ వర్షంపాతం నమోదైంది. నైరుతి బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారుతోంది. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతా వరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట పొలాలు నీటి మునిగాయి. కోసిన వరి పనలు నీటిలోనే ఉన్నాయి. చిరు వ్యాపారులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోపాలపట్నం ఇందిరానగర్‌లో ప్రహరీ కూలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment