పొదుపుతోనే ఇంధన వనరుల సంరక్షణ
ఏయూ క్యాంపస్: సహజ ఇంధన వనరులను పొదుపుగా వినియోగించి, భావి తరాల కోసం సంరక్షించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ముగింపు సందర్భంగా మహోద్యమంగా విద్యుత్ పొదుపును తీర్చిదిద్దుదాం అనే నినాదంతో శుక్రవారం ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడితో కలిసి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తక్కువ విద్యుత్‌తో నడిచే పరికరాల వినియోగం, ఆవిష్కరణకు సాంకేతిక సహాయాన్ని తీసుకోవాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ప్రయోజనాలను వివరించారు. సీఎండీ మాట్లాడుతూ భావితరాల అవసరాల దృష్ట్యా ఇంధన వనరుల వృథాను అరికట్టాలన్నారు. ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే రెండు యూనిట్లు ఉత్పత్తి చేసినట్లేనన్నారు. వారోత్సవాల్లో సందర్భంగా వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులు అందించారు. ఎస్‌ఈ జి.శ్యాంబాబు, ఈఈలు బి.సింహాచలం నాయుడు, బి.కె.నాయుడు, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment