సొంత డబ్బులతోనే చదువుకుంటున్నా..
పాడేరు నుంచి వచ్చి ఓ ప్రైవేట్ కాలేజీలో బీఈడీ చదువుతున్నాను. ప్రస్తుతం మూడో సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. గిరిజన తెగకు చెందినప్పటికీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా స్కాలర్‌షిప్ రాలేదు. అక్కలిద్దరూ ఇచ్చిన డబ్బులతోనే చదువుతున్నాను. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో కాలేజీకి ఇంటి నుంచి పంపిన రూ.41 వేలు చెల్లించా. ప్రస్తుతం రెండో ఏడాది ఫీజు చెల్లించాలని కాలేజీ వారు అడుగుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు.
– కె.అరుణకుమారి, బీఈడీ విద్యార్థిని
Comments
Please login to add a commentAdd a comment