ముప్పు
ప్రభుత్వ బడికి
మోడల్ ప్రైమరీ స్కూళ్ల పేరిట డ్రామా
నగరంలో వార్డు ప్రాతిపదికన, రూరల్ మండలాల్లో పంచాయతీకి ఒకటి చొప్పున ‘మోడల్ ప్రైమరీ స్కూల్’ ఏర్పాటు చేయాలనే ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ఆగమేఘాల మీద కసరత్తు చేస్తోంది. ఇలా ఏర్పాటు చేసే స్కూళ్లలో 1 నుంచి 5వ తరగతి వరకు నిర్వహిస్తారు. జిల్లాలో 184 మోడల్ స్కూళ్లు ఏర్పాటుకు ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. విద్యారంగ భవిష్యత్ పేరిట చేస్తున్న కసరత్తుపై ఉపాధ్యాయ వర్గానికి కానీ, విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ, అటు ప్రజా ప్రతినిధులకు కూడా తెలియనివ్వకుండా అంతా గోప్యత పాటిస్తుండటం గమనార్హం.
ప్రైమరీ స్కూళ్లకు ఎసరు
పాఠశాల విద్యలో ఇక నుంచి శాటిలైట్ స్కూళ్లు(పీపీ–1,పీపీ–2), ఫౌండేషన్ స్కూళ్లు(పీపీ–1,పీపీ–2, అలాగే 1, 2 తరగతులు), మోడల్ ప్రైమరీ స్కూళ్లు (పీపీ–1,పీపీ–2, అలాగే 1 నుంచి 5 వరకు), హైస్కూళ్లు (6 నుంచి 10 వరకు) ఉండేలా కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై విద్యాశాఖ కమిషనర్ జిల్లాకు వచ్చి అధికారులకు దిశానిర్దేశం చేసి వెళ్లారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ సైతం పలు దఫాలు విద్యాశాఖాధికారులతో సమీక్షించారు. జిల్లాలో మండల పరిషత్/జెడ్పీ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో 350 ప్రైమరీ స్కూళ్లు, మున్సిపల్ మేనేజ్‌మెంట్ పరిధిలో 95, మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1, ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ –1 ఉన్నాయి. వీటిలో ఐదుగురులోపు విద్యార్థులు ఉన్న 25 ప్రైమరీ స్కూళ్లను పూర్తిగా మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా ఎంపిక చేసిన వాటిలో మినహా, మిగతా ప్రైమరీ స్కూళ్లలో కేవలం 1, 2 తరగతులు మాత్ర మే అందుబాటులో ఉంటాయి. ఇలాంటి చర్యలతో నగరంలోని శివారు కాలనీలు, రూరల్ ప్రాంతంలోని గ్రామాల్లో గల ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లు నిర్వీ ర్యమవుతాయి. ఫలితంగా విద్యార్థులంతా ప్రైవేటు స్కూళ్లు, కాన్వెంట్‌ల వైపు వెళ్తారు. అంతిమంగా ప్రైవేట్ విద్యారంగం బలపడనుంది.
●
Comments
Please login to add a commentAdd a comment