ప్రాథమికోన్నత పాఠశాలలు మాయం
ప్రాథమికోన్నత పాఠశాలలను పూర్తిగా రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ యాజమాన్య పరి ధిలో జిల్లాలోని 31 ప్రాథమికోన్నత పాఠశాలలు మూతపడనున్నాయి. యూపీ స్కూళ్లను రద్దు చేసి 30 మందికి పైగా విద్యార్థులు ఉన్న చోట ప్రైమరీ స్కూళ్లుగా కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో 100 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్లు మిగిలిపోతారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించడంతో జిల్లా లోని ప్రభుత్వ బడుల్లో 2024–25 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు గణనీయంగా తగ్గిపోయా యి. తాజా పరిణామాలతో జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలల చరిత్ర ముగిసినట్లే.
Comments
Please login to add a commentAdd a comment