● రేషనలైజేషన్‌తో మూతపడనున్న స్కూళ్లు ● 117 జీవో రద్దు ప
పేదవర్గాలకు
చదువులు దూరం
ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యావిధానాల వల్ల నిరుపేద వర్గాల పిల్లలకు చదువులు దూరమవుతాయి. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకపోతే, వారంతా డ్రాపవుట్‌గా మిగిలిపోతారు. కాస్తో కూస్తో ఆర్థికంగా ఉన్న వారు ప్రైవేటు స్కూళ్లలో చేరుతారు. – టి.ఆర్.అంబేడ్కర్,
యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి
బేసిక్ ప్రైమరీ స్కూళ్లు
ఉండాల్సిందే..
మోడల్ ప్రైమరీ స్కూళ్లు అనేవి మంచివే. కానీ, ప్రైమరీ స్కూళ్లు కూడా యథాతథంగా కొనసాగించాలి. ప్రస్తుతం విద్యార్థులు తక్కువ ఉన్నారనే కారణంతో ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తే, భవిష్యత్‌లో విద్యార్థులంతా ప్రైవేటు స్కూళ్లలో చేరతారు. దీనిపై మా సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వినతిపత్రం అందిస్తాం.
– కె.నాగేశ్వరరావు,
పీఆర్‌టీయూ జిల్లా కార్యదర్శి
యూపీ స్కూళ్లు
కొనసాగించాలి
ప్రాథమికోన్నత పాఠశాలలలను పూర్తిగా రద్దు చేయడం తీవ్రమైన తప్పిదం. దీని వల్ల గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేని పరిస్థితులు ఏర్పడతాయి. దీని వల్ల విద్యార్థులు డ్రాపవుట్‌గా మిగిలే అవకాశం ఉంది. నిరుపేద వర్గాల పిల్లలు కూడా ప్రత్యామ్నాయంగా ప్రైవేటు స్కూళ్లలో చేరాల్సి వస్తోంది. ఇలాంటి చర్యలు ప్రభుత్వ విద్యారంగానికి తీవ్ర నష్టం. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని ఇప్పటికే మా సంఘం రాష్ట్ర నాయకత్వం ద్వారా విన్నవించాం.
– ఇమంది పైడిరాజు, ఎస్టీయూ జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment