ఒడిశాకి తరలివెళ్లిన అప్పన్న ప్రచార రథం
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన ప్రచార రథం ఆదివారం మధ్యాహ్నం ఒడిశాకు తరలివెళ్లింది. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఈనెల 6 వరకు ప్రచార రథం పర్యటించనుంది. ఒడిశాకి చెందిన లక్ష్మీకాంత్‌నాయక్ దాస్ ఆధ్వర్యంలో బరంపురానికి సమీపంలోని పట్టుపురంలో ఈనెల 3న శ్రీనృసింహహోమం, స్వామి కల్యాణోత్సవం జరుగుతాయి. 4వ తేదీన పద్మనాభపురంలో, 5వ తేదీన విష్ణుచక్రపురంలో శ్రీనృసింహహోమం, కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 6వ తేదీన చికిడీలో కల్యాణోత్సవం అనంతరం ప్రచారరథం తిరిగి సింహాచలం బయలు దేరుతుంది. ముందుగా ప్రచార రథాన్ని దేవస్థానం ఏఈవో ఆనంద్‌కుమార్ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment