పరిపూర్ణ మహిళ అమ్మడమ్మ
● మాజీ మంత్రి బొత్స, జెడ్పీ చైర్మన్
మజ్జి శ్రీనివాసరావు
బొబ్బిలి: వసుదైక కుటుంబాన్ని తీర్చిదిద్దిన పరిపూర్ణ మహిళగా శంబంగి అమ్మడమ్మ భవిష్యత్ కుటుంబ వ్యవస్థలోనూ నిలిచిపోతారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సోదరుడు శ్రీరాములునాయుడి సతీమణి, విశాఖ డెయిరీ సీనియర్ డైరెక్టర్ అమ్మడమ్మ సంస్మరణ కార్యక్రమం బుధవారం మండలంలోని పక్కిలో జరిగింది. కార్యక్రమానికి రాష్ట్రంలోని పలు రాజకీయ, వ్యాపార కుటుంబాలకు చెందిన ప్రముఖులు హాజరై అమ్మడమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అమ్మడమ్మ అడుగుజాడల్లో నడవాలి : జడ్పీ చైర్మన్
ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ద్విగ్విజయంగా నడిపించిన శంబంగి అమ్మడమ్మ అడుగుజాడల్లో నేటి కుటుంబ వ్యవస్థ, కుటుంబాల్లోని సభ్యులు నడవాలని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం పక్కిలో జరిగిన సంస్మరణ కార్యక్రమానికి ఆయన హాజరై అమ్మడమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అమ్మడమ్మ సంస్మరణ కార్యక్రమానికి హాజరైన వారిలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, అలజంగి జోగారావు, తలే వీరభద్రయ్య, బొబ్బిలి చిరంజీవులు, మాజీ డీసీసీబీ చైర్మన్ వేచలపు చినరామినాయుడు, వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంటు అధ్యక్షుడు శతృచర్ల పరీక్షిత్ రాజు, విశాఖ డెయిరీ చైర్మన్ అడారు ఆనంద కుమార్, డైరెక్టర్లు, సిబ్బంది, బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ ఎస్వీ మురళీ కృష్ణారావు, పార్వతీపురం టీడీపీ నాయకులు ద్వారపురెడ్డి జగదీష్, బొబ్బిలి మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఉత్తరాంధ్రలోని వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని అమ్మడమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment