మ్యాన్ పవర్ టెండర్ రద్దు చేయాలి
విజయనగరం అర్బన్: ఆర్టీసీ విజయనగరం జోనల్ వర్క్ షాప్ మేనేజర్ ఇటీవల ఏకపక్షంగా నోటిఫికేషన్ ఇచ్చిన మ్యాన్ పవర్ టెండర్ షెడ్యూల్‌ను రద్దు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ కమిటీ డిమాండ్ చేసింది. స్థానిక జోనల్ కమిటీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు పలువురు డిమాండ్ చేశారు. విజయనగరం జోనల్ వర్క్ షాప్‌లో కొన్ని క్యాటగిరీల పోస్టులకు సంబంధించి అవుట్ సోర్సింగ్ నియామకం మ్యాన్ పవర్ టెండర్ షెడ్యూలు వల్ల ప్రస్తుతం సంస్థల పని చేస్తున్న అనేక మంది పదోన్నత అవకాశాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వివిధ సమస్యలతో ఆర్టీసీ ఉద్యోగులు సతమతమవుతున్నారని ఈ టెండర్ నోటిఫికేషన్ వల్ల కార్మికులకు మరిన్ని సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఈ టెండర్ నోటిఫికేషన్ వల్ల కార్మికుల్లో మరింత ఆందోళన కలిగించినట్లు అవుతారని అన్నారు. దీన్ని ఎంప్లాయిస్ యూనియన్ వ్యతిరేకిస్తుందని ఇప్పటికే జోనల్ మేనేజర్, వర్క్ షాప్ మేనేజర్‌కి యూనియన్ జోనల్ కమిటీ, వర్క్ షాప్ కమిటీ అభ్యంతరం తెలియజేశామని తెలిపారు. అనంతరం జోన్ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జోన్ ఈడీకి వినతిపత్రం అందజేశారు. నవంబరు ఆరో తేదీ విజయవాడలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు తెలియజేసి, భవిష్యత్తు కార్యక్రమాలు చేపట్టడతామని తెలిపారు. సమావేశంలో ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు పి.భానుమూర్తి, సిహెచ్.వెంకటరావు, జోనల్ నాయకులు కేజే సుధాకర్, అధ్యక్షుడు బీకే మూర్తి, కార్యదర్శి జి.తాతాలు, జోనల్ వర్క్ షాప్ రీజనల్ ప్రెసిడెంట్ కేఏ రాజు, సెక్రెటరీ యు.ఎర్రంనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ కమిటీ డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment