● సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ
సభ్యుడి పిలుపు
విజయనగరం పూల్‌బాగ్:
ఈనెల 16,17తేదీల్లో విజయనగరంలో జరగనున్న సీపీఎం 10వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రెడ్డి శంకరరావు పిలుపునిచ్చారు. ఇంటింటి ప్రచారం, నిధి వసూల్ కార్యక్రమం స్థానిక పూల్‌బాగ్, ఉడాకాలనీ, తోటపాలెంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ జిల్లాలోను, నగరంలోనూ ప్రజా సమస్యలపై ఆనేక పోరాటాలు చేసింది సీపీఎం మాత్రమేనన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు ను తిప్పికొట్టి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పోరాడిన సీపీఎంను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు రమణమ్మ, జగన్ మోహన్, రమణ, రామచంద్రరావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment