సాలూరు: తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని సీ్త్ర, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణిని 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు కోరారు. 1998 ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్, పార్వతీపురం మన్యం జిల్లా యూనియన్ సెక్రటరీ కొల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల ఎంటీఎస్ ఉపాధ్యాయు లు ఆదివారం మంత్రి సంధ్యారాణిని పట్టణంలో ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంటీఎస్ పేరుతో తమకు అరకొర వేతనాలు ఇస్తున్నారని, తామంతా ఆర్థికంగా ఇబ్బందు లు పడుతున్నామని వాపోయారు. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వాటిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment