పాఠశాల స్థాయిలో నైపుణ్యంతో కూడిన చదువులకు ప్రాధాన్యమిచ్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. ఫుడ్‌ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పాఠశాల పనిదినాల్లో రెగ్యులర్ తరగతులు నిర్వహిస్తూ సెలవు రోజుల్లో వృత్తి విద్యాకోర్సులు అభ్యసించే విద్యార్థులను క్షేత్ర సందర్శనకు తీసుకువెళ్తారు. పాఠశాలకు సమీపంలో కుటీర, మధ్య తరగతి పరిశ్రమలు, చేతి వృత్తి కేంద్రాలు, బ్యూటీషియన్ సెంటర్లలో శిక్షణ ఇస్తారు. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను క్షేత్ర స్థాయిలో సరిపోల్చుతూ మరింత అవగాహన కల్పిస్తు్‌ాన్నరు. విద్యార్థులు తమ ఆలోచనలు పంచుకుని సరికొత్త ప్రయోగాలు చేసేందుకు ఈ విధానం దోహదపడుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment