పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు స్వశక్తిపై నిలబడేలా జిల్లాలో ఎంపిక చేసిన 19 పాఠశాలల్లో వృత్తి విద్యాకోర్సులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రతి పాఠశాలలో ఇద్దరు చొప్పున బోధకులను నియమించారు. వారు 9, 10వ తరగతి, ప్లస్‌టూ కళాశాలలో ఆసక్తి ఉన్న విద్యార్థులను ఒక్కో ట్రేడ్‌కు 50 మంది చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్‌మీడియట్ పూర్తయ్యేసరికి ప్రతి విద్యార్థి తమకు నచ్చిన రెండు కోర్సుల్లో నైపుణ్యం సాధించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియను సమగ్రశిక్ష అధికారులు పర్యవేక్షిస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment