రాష్ట్రస్థాయి పోటీలకు మెంటాడ విద్యార్థులు ఎంపిక
మెంటాడ: అన్నమయ్య జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు మెంటాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అర్హత సాధించారు. అండర్–14 విభాగంలో ఎస్.చంద్రమౌళి, దిలీప్, జి.బోగిరాజు, టి.అఖిల్, బి.నితిన్, అండర్–17 బాలికల విభాగంలో కె.తనూజ, టి.కావ్య ఎంపికయ్యారు. వీరిని హెచ్‌ఎం సీహెచ్ అరుణ, పీడీ టి.శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, గ్రామ స్తులు మంగళవారం అభినందించారు.
రాజరాజేశ్వరిదేవి విగ్రహానికి ఆదిత్యుని కిరణ స్పర్శ
బొండపల్లి: దేవుపల్లి గ్రామంలోని రాజరాజేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని మంగళవారం ఉదయం భానుడి లేలేత కిరణాలు స్పర్శించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులు తన్మయత్వం చెందారు. దూసి శ్రీధర్‌శర్మ మంత్రోచ్ఛరణాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.
కుటుంబం చెంతకు బాలుడు
బీచ్‌రోడ్డు (విశాఖ): తప్పిపోయిన బాలుడిని పోలీసులు కుటుంబం చెంతకు చేర్చారు. విశాఖపట్నం మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరానికి చెందిన టి.స్వరూప్‌కుమార్ విజయనగరంలోని ఆశ్రమంలో మూడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఆశ్రమం నుంచి దారితప్పి విశాఖ చేరుకున్నాడు. సిరిపురం ప్రాంతంలో రోడ్డుపై అనుమానస్పదంగా తిరుగుతుండడంతో అక్కడ విధుల్లో ఉన్న ఎస్‌ఐ సురేష్ బృందం గమనించింది. బాలుడు దగ్గరకు వెళ్లి వివరాలు ఆడగ్గా ఆశ్రమం నుంచి వచ్చినట్లు తెలిపారు. దీంతో బాలుడు తాతయ్య, మావయ్యకు సమాచారం అందజేశారు. వారు విశాఖ రాగా..బాలుడిని అప్పగించారు.
జాతీయస్థాయి పోటీలకు ఆశ్రమ విద్యార్థిని
సీతంపేట: మండలంలోని పూతికవలస గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థిని ఎస్.నైమిశా షాట్‌ఫుట్ విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. లక్నోలో జరగనున్న షాట్‌ఫుట్ పోటీల్లో పాల్గొననున్న విద్యార్థినిని ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర మంగళవారం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment