పక్కాగా ఎన్నికల కోడ్ అమలు
విజయనగరం అర్బన్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కోసం ప్రత్యేక అధికార బృందాలను నియమించినట్టు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన మంగళవారం మాట్లాడుతూ మండల స్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును ఈ బృందాలు పర్యవేక్షిస్తాయని చెప్పారు. మున్సిపల్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్‌ఐలు, గ్రామీణ ప్రాంతాల్లో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్‌ఐలు బృందంలో సభ్యులుగా ఉంటారన్నారు. మొత్తం 23 బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వీటికి అదనంగా బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెలిమర్ల, విజయనగరం, ఎస్.కోటలో ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించామన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అక్రమ నగదు వ్యవహారాలు, అనుమానాస్పదంగా ఉన్న నగదు బదిలీలు, ఓటర్లను ప్రలోబపెట్టేందుకు జరిగే ప్రయత్నాలపై నిఘా ఉంచుతాయని పేర్కొన్నారు. నిర్ణీత ప్రదేశంలో చెక్ పోస్టులు ఏర్పాటుచేసి పెద్ద మొత్తంలో నగదు, మద్యం వంటి అక్రమ రవాణాను నిరోధించేందుకు ఈ బృందాలు పనిచేస్తాయని తెలిపారు.
ప్రత్యేక అధికార
బృందాల నియామకం
కలెక్టర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment