కంచమ్మా.. కరుణించమ్మా..
మెరకముడిదాం: మండలంలోని కొండలావేరు గ్రామ సమీపంలో బోడికొండపై వెలసిన కంచెమ్మతల్లి జాతరకు భక్తులు పోటెత్తారు. ఏటా నాగులచవితి నాడు జాతర నిర్వహించడం ఆనవాయితీ. మంగళవారం నిర్వహించిన జాతరలో మండలవాసులతో పాటు చీపురుపల్లి, గరివిడి, గుర్ల, తెర్లాం, బొబ్బిలి, బాడంగి, దత్తిరాజేరు మండలాలకు చెందిన వారితో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పసుపుకుంకుమలు సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఉదయం 7 గంటల నుంచి పెరిగిన భక్తుల తాకిడి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. క్యూలు కిక్కిరిశాయి. సుమారు 80 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించినట్టు ఆలయ కమిటీ సభ్యులు అంచనా వేస్తున్నారు. భక్తులకు మజ్జిగ, తాగునీరు, ప్రసాదాలను పలువురు స్వచ్ఛంద సేవకులు అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బుధరాయవలస ఎస్‌ఐ జి.లోకేష్‌కుమార్ తన సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు.
అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
మొక్కుబడుల చెల్లింపు
భక్తుల సేవలో స్వచ్ఛంద సేవకులు
Comments
Please login to add a commentAdd a comment