ముగిసిన విలువిద్య పోటీలు
సీతానగరం: జోగింపేటలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయ ప్రాంగణంలో డీఈఓ, జిల్లా క్రీడాధికారి డాక్టర్ ఎన్.తిరుపతినాయుడు ఆధ్వర్యంలో మూడురోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి విలువిద్య (ఆర్చరీ) పోటీలు మంగళవారంతో ముగిశాయి. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్‌జీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృ మాట్లాడుతూ 13 ఉమ్మడి జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులు పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారన్నారు. ఇక్కడ ఎంపికై న వారు గుజరాత్ రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచి రాష్ట్రానికి పేరుతేవాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన వారికి రూ 2.5 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ.1.5 లక్షలు, తృతీయస్థానం సాధించిన క్రీడాకారులకు రూ.లక్ష ప్రోత్సాహక బహుమతి అందజేస్తారని తెలిపారు. కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ప్రోత్సాహంతో ఇక్కడ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించినట్టు వెల్లడించారు. విలువిద్య క్రీడల రాష్ట్ర పర్యవేక్షకుడు ఎన్.వి.రమణ మాట్లాడుతూ పదమూడు జిల్లాల నుంచి అండర్–14, 17, 19 విభాగాల్లో పోటీలకు హాజరైన బాల, బాలికలకు జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు చక్కని అతిథ్యం ఇచ్చారన్నారు. డీఈఓ డాక్టర్ ఎన్.తిరుపతినాయుడు మాట్లాడుతూ విలువిద్య పోటీలను పార్వతీపురం మన్యం జిల్లా జోగింపేటలో నిర్వహించడం అభినందనీయమన్నారు. జోగింపేటలో మూడు రోజులపాటు క్రీడల నిర్వహణకు సహకరించిన గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ మధుబాబు, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ రాజ్‌కుమార్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావు, ఎంఈఓలు కె.ప్రసాదరావు, సూరిదేముడు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment