శృంగవరపుకోట నియోజకవర్గంలో హాస్టళ్ల సమస్య తీరట్లేదు. నియోజకవర్గ కేంద్రమైన ఎస్.కోటలో ఉన్న ఎనిమిది హాస్టళ్లనూ ఒకే గొడుగు కింద చేర్చి ఒకే మెనూ అమలయ్యేలా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మించాలన్న ప్రతిపాదనకు మోక్షం కలగలేదు. ఎస్సీ కళాశాల బాలుర వసతి గృహం, బాలికల వసతి గృహం, బీసీ కళాశాల బాలుర వసతి గృహం, బాలికల వసతి గృహాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. వీటికి నెలకు రూ.1.50 లక్షలు అద్దె చెల్లిస్తున్నారు. అయినా బెడ్లు లేవు. అరకొరగా మరుగుదొడ్లు, బాత్రూమ్‌లు ఉన్నాయి. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక దోమల సమస్య ఎక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment