ఏకాగ్రతతోనే లక్ష్యాల సాధన
విజయనగరం అర్బన్: ఏకాగ్రతతోనే లక్ష్యాల సాధన సాధ్యమని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురజాడ అప్పారావు బీసీ స్టడీ సర్కిల్ బీసీ అభ్యర్థులకు అందిస్తున్న డీఎస్సీ ఉచిత శిక్షణను కస్పా మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఆయన సోమ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఉపాధ్యాయ నియామక రాత పరీక్షకు సన్నద్ధమవుతూనే జాతీ య స్థాయిలో నిర్వహించే వివిధ రకాల పోటీ పరీక్షలపై దృష్టిపెట్టాలన్నారు. పోటీ పరీక్షలను ఎదుర్కోవడంలో తన అనుభవాలను వివరించారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారి పెంటోజీ మాట్లాడుతూ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 182 మందికి రెండు నెలలపాటు ఉచిత శిక్షణ, రూ.వెయ్యి విలువచేసే స్టడీ మెటీరియల్తో పాటు నెలకు రూ.1,500 చొప్పున స్టైఫండ్గా అందజేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment