● కళ తప్పిన శిల్పారామం
విద్యలనగరం వైభవాన్ని చాటుతూ.. నగర ప్రజలు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే శిల్పారామం ప్రస్తుతం కళావిహీనంగా మారింది. ఆలనాపాలనా చూసేవారు లేక అభివృద్ధికి ఆమడ దూరంలో నిలుస్తోంది. గతంలో అందంగా ముస్తాబై చిన్నారులను ఆకర్షించేది. పెద్దలు సేద తీరేందుకు అనువుగా ఉండేది. సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా నిలిచేది. నేడు శిల్పారామం గురించి పట్టించుకునేవారు లేక ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారడం చూపరులకు ఆవేదన మిగుల్చుతోంది. దీనికి ఈ చిత్రాలే సజీవ సాక్ష్యం.
– సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment