● నయనం ప్రధానం
నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో దృష్టి లోపాలు వచ్చే అవకాశాలు ఉంటాయని, కంటి పరీక్షలు చేయించడంలో తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు. పుష్పగిరి కంటి ఆస్పత్రికి చెందిన విట్రియా రెటినా ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ప్రీ మెచ్యూర్ డే ర్యాలీని మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏటా 3.6 మిలియన్ల మంది పిల్లలు నెలలు నిండకుండానే పుడుతున్నారని, శిశువు దశలో కంటి పరీక్షలు నిర్వహించకపోతే అంధత్వానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. నయనం ప్రధానం అన్నది గుర్తెరగాలన్నారు. కార్యక్రమంలో పుష్పగిరి కంటి ఆస్పత్రి సీఈఓ రాజేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సూర్యనారాయణ, తారక్,
తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం ఫోర్ట్
Comments
Please login to add a commentAdd a comment