● వేతన ‘ఆశ’ల పోరాటం
ఆశ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ విజయనగరం కలెక్టరేట్ వద్ద మంగళవారం మహాధర్నా చేశారు. ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారంలో టీడీపీ కూటమి ప్రభుత్వ అలసత్వంపై నిరసన తెలిపారు. పనిభారం తగ్గించాలని, వైద్యేతర పనులు చెప్పొద్దని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ సెలవులు వర్తింపజేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని ఆశవర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు బి.సుధారాణి డిమాండ్ చేశారు. డయేరియా సోకిన వారికి సేవలందిస్తూ అనారోగ్యంపాలై మృతిచెందిన నాగులవలస ఆశవర్కర్ పూర్ణిమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాడతామంటూ నినదించారు. ధర్నాలో సంఘ సభ్యులు కె.వెంకటలక్ష్మి, కె.రాధారాణి, కర్రి రాజేశ్వరి, ఎం.లక్ష్మితో పాటు వందలాది మంది ఆశవర్కర్లు పాల్గొన్నారు. – విజయనగరం ఫోర్ట్
Comments
Please login to add a commentAdd a comment