కేజీబీవీ పోస్టులకు 46 మంది ఎంపిక
విజయనగరం అర్బన్: కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల ఎంపిక ప్రక్రియ స్థానిక సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఖాళీగా ఉన్న 53 పోస్టులకు గాను 52 పోస్టులకు అభ్యర్థులను ఎంపికచేసి నియామక ఉత్తర్వులు అందజేసినట్టు డీఈఓ ఎం.మాణిక్యంనాయుడు తెలిపారు. నియమితులైన వారిలో ఆరుగురు అన్విల్లింగ్ లెటర్లు ఇచ్చారన్నారు. నాన్‌టీచింగ్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలోను, టీచింగ్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేశామన్నారు. ఎంపిక ప్రక్రియలో సాంఘిక సంక్షేమాధికారి రామానందం, జీసీడీఓ మాలతి, సర్వశిక్ష సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment