‘ఉపాధి’ నిధులతో అభివృద్ధి పనులు
రామభద్రపురం: రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు రూ.3 వేల కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, చెక్‌డ్యామ్‌లు వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు జాతీయ ఉపాధిహామీ పథకం కేంద్ర డిప్యూటీ కార్యదర్శి ఆశిస్ గుప్తా అన్నారు. మండలంలోని కొట్టక్కి, కాకర్లవలస, తారాపురం గ్రామాలలో జరుగుతున్న ఉపాధి పనులను స్టేట్ డైరెక్టర్ షణ్ముక్ కుమార్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. అలాగే పండ్ల తోటలు, చెరువు గట్లపై నాటిన మొక్కలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఎన్ని ఎకరాలలో ఉద్యాన పంటలు వేశారు..? ఎకరాకు ఎన్ని మొక్కలు వేశారు..? మెయింటినెన్స్ నిధులు అందుతున్నాయా, లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి 30 వేల అభివృద్ధి పనులు మంజూరు కాగా.. డిసెంబర్ 31లోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఉపాధి కల్పనే లక్ష్యం..
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు జాతీయ ఉపాధిహామీ పథకం కేంద్ర డిప్యూటీ కార్యదర్శి ఆశిస్ గుప్తా అన్నారు. ఉపాధి వేతనం ప్రతి సంవత్సరం పెంచుతున్నట్లు చెప్పారు. జల సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో 23 వేల గోకులాల షెడ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఉపాధిహామీ పఽథకం ప్రొగ్రాం అధికారి కిరణ్ పాడి, డ్వామా పీడీ కల్యాణ్ చక్రవర్తి, ఎంపీడీఓ రత్నం, ఏపీడీలు కిరణ్, శ్రీనివాసరావు, ఏపీఓలు త్రినాథరావు, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు జీవనోపాధి కల్పనే లక్ష్యం
జాతీయ ఉపాధిహామీ పథకం కేంద్ర డిప్యూటీ కార్యదర్శి ఆశిస్ గుప్తా
Comments
Please login to add a commentAdd a comment