సచివాలయం విధుల నుంచి మినహాయింపు
● కలెక్టర్‌కు జేఎల్‌ఎంల వినతిపత్రం
విజయనగరం ఫోర్ట్: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న జూనియర్ లైన్‌మన్ గ్రేడ్–2 వారిని సచివాలయం విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘం (1104) ప్రతినిధులు మంగళవారం కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో అత్యవసర పనులతో పాటు అనేకమైన విధులు నిర్వహిస్తుండగా అదనంగా సచివాలయం పనులు అప్పగించడం వల్ల ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో ఉన్నామన్నారు. విధి నిర్వహణలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. మరి కొంతమంది క్షతగాత్రులయ్యారని వాపోయారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సంఘం నాయకులు సురగాల లక్ష్మణ్, వంగపండు లక్ష్మణరావు, టి. గంగునాయుడు. ఎన్.పైడిరాజు, గుమ్మడి దేముడు, గనివాడ అప్పలనాయుడు, భోగి సూరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment