విజయనగరం అర్బన్: వచ్చే నెల 1వ తేదీన విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎదుట నిర్వహించనున్న స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక మహాధర్నాను విజయవంతం చేయాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సోము రాంబాబు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక బీఎస్పీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా ప్రచార పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాధర్నాకు పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జ్, రాజ్యసభ సభ్యుడు రామ్‌జీ గౌతమ్ హాజరవుతారని తెలిపారు. జిల్లా నుంచి అధికసంఖ్యలో ప్రజలు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జ్ అర్జి శివప్రసాద్, జిల్లా అధ్యక్షుడు కె.సోములు, ఉపాధ్యక్షురాలు గౌరి, ప్రధాన కార్యదర్శి ఆర్జే రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు పైడిరాజు, ప్రకాశరావు, పొడుగు శంకరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment