30న ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ నైరెడ్‌లో ఈ నెల 30న ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్ ఎం. రాజేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గల నిరుద్యోగ సీ్త్ర, పురుషులు అర్హులని పేర్కొన్నా రు. పురుషులకు కంప్యూటర్ డీటీపీ (45 రోజులు), ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ (30 రోజులు), ఫొటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ (30 రోజులు), కారు డ్రైవింగ్ (ఎల్‌ఎల్‌ఆర్ కలిగి ఉండాలి, 30 రోజులు), అలాగే సీ్త్రలకు బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్ (30 రోజులు), హోమ్ నర్సింగ్ (30 రోజుల పాటు)లలో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు పదో తరగతి మార్కుల లిస్టు, రేషన్ కార్డు, ఆధార్ కార్డులతో పాల్గొనాలని సూచించారు. శిక్షణా కాలంలో భోజన, వసతి సదుపాయం కల్పించ నున్నామని తెలిపారు. వివరాలకు 90147 16255, 9491741129 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
నేడు జిల్లాకు రానున్న ఓటర్ల జాబితా పరిశీలకులు
విజయనగరం అర్బన్: ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమంపై పరిశీలించే నిమిత్తం ఎలక్టోరల్ రోల్ జిల్లా పరిశీలకులు, రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ ఎంవీ శేషగిరి బాబు సోమవారం జిల్లాకు వస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బీఆర్ అంబేడ్క ర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మధ్యా హ్నం 3గంటలకు జిల్లాలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, సహాయ అధికారులు, జిల్లా కు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, రాజకీయ పా ర్టీల ప్రతినిధులతో సమీక్షిస్తారని పేర్కొన్నారు.
తిప్పలవలస మత్స్యకారుల విడుదల
పూసపాటిరేగ : మండలంలోని తిప్పలవలస గ్రామానికి చెందిన 9 మంది మత్స్యకారులను వారం రోజుల కిందట ఒడిశా తీరంలో ఇండియన్ కోస్ట్‌గార్డులు అదుపులోకి తీసుకున్న విషయం పాఠకులకు విదితమే. వారం రోజుల నుంచి కోస్ట్‌గార్డుల అదుపులో వున్న తిప్పలవలస మత్స్యకారులు విడుదల కోసం బాధిత మత్స్యకారుల బంధువులు ఎమ్మెల్యే లోకం నాగమాధవితో పాటు అధికారులను ఆశ్రయించారు. ఎమ్మెల్యేతో పాటు అధికారులు ఇండియన్ కోస్ట్‌గార్డు అధికారులతో చర్చించారు. దీంతో అదుపులోకి తీసుకున్న మత్స్యకారులను కోస్ట్‌గార్డు అధికారులు ఆదివారం విడుదల చేసారు.
పైడితల్లిని దర్శించుకున్న ప్రభుత్వ కార్యదర్శి నాయక్
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడి తల్లి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్ సతీసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం వేదపండితులు నాయక్ దంపతులకు వేదాశీస్సులు, అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఇన్‌చార్జి ఈఓ కెన్‌విడి.ప్రసాద్ పాల్గొన్నారు.
రామతీర్థంలో వైభవంగా పూజలు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం రామతీర్థం శ్రీసీతారామస్వామి దేవస్థానంలో పవి త్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చ న, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవనం, ఆదిత్య హృదయం తదితర హోమాలను శాస్తోక్త్రంగా జరిపించారు. అనంతరం వెండి మండపం వద్ద సీతారాముల నిత్య కల్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ స్థానాచార్యులు నరిసింహాచార్యులు ఆధ్వర్యంలో తిరుప్పావై ఉపన్యాసాలు చదివి వినిపించారు. అర్చకులు సాయి రామాచార్యులు, కిరణ్‌కుమారాచార్యులు, పవన్, రామగోపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment