త్రిపుర హైకోర్టులో పెండింగ్‌ కేసుల్లేవు.. | - | Sakshi
Sakshi News home page

త్రిపుర హైకోర్టులో పెండింగ్‌ కేసుల్లేవు..

Published Mon, Dec 23 2024 12:32 AM | Last Updated on Mon, Dec 23 2024 12:32 AM

త్రిపుర హైకోర్టులో పెండింగ్‌ కేసుల్లేవు..

త్రిపుర హైకోర్టులో పెండింగ్‌ కేసుల్లేవు..

● కోర్టుకు తాళం వేసి వచ్చా.. ● ఈ పరిస్థితి దేశం అంతా రావాలి ● త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమర్‌నాఽథ్‌గౌడ్‌

కొత్తవలస : త్రిపుర హైకోర్టులో ఎటువంటి కేసులు పెండింగ్‌లో లేవని, కోర్టుకు తాళం వేసి వచ్చానని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.అమర్‌నాథ్‌గౌడ్‌ అన్నారు. మండలంలోని గురుదేవ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలోలో ఏర్పాటు చేసిన క్యాన్సర్‌ ఆస్పత్రి ప్రారంభానికి ఆయన ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అక్కడ పెండింగ్‌లో ఉన్న 65 శాతం కేసులను పరిష్కరించానని తెలిపారు. వరుసగా నాలుగైదు రోజులు కేసులు లేకపోవడంతో కోర్టుకు తాళం వేసి ఉంటుందన్నారు. ఇలాంటి పరిస్థితి దేశం అంతా రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తాను గతంలో ప్రపంచ రికార్డులో భాగంగా భారతదేశం నుంచి 92 వేల కేసులకు తీర్పులు చెప్పానని, రోజుకు సరాసరి 109 కేసులకు సంబంధించి జడ్జిమెంట్లు ఇచ్చానని తెలిపారు. ఇందులో కేవలం 19 కేసులు మాత్రమే సుప్రీం కోర్టుకు అప్పీల్‌కు వెళ్లాయని చెప్పారు. దీన్ని బట్టి కక్షిదారులు, న్యాయవాదులు ఎంత సంతోషకరంగా ఉన్నారో అర్ధం చేసుకోవాలన్నారు. ఇది తనకు ఎంతో ఆత్మ సంతృప్తి ఇచ్చిందన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో 2 లక్షల 30 వేల కేసులు పెండింగ్‌లో ఉంటే 88 వేల కేసులను పరిష్కరించినట్టు తెలిపారు. లిటిగేషన్‌ లేని కోర్టు, పేషంట్‌ లేని ఆస్పత్రులు, వృద్ధుల్లేని వృద్ధాశ్రమాలు ఉండాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement