విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
గజపతినగరం: విద్యారంగ సమస్యలను ప్రభు త్వం త్వరితగతిన పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీకే ఈశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ 32వ జిల్లా మహాసభల ముగింపు కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, సెంట్రల్ యూనివర్సిటీకి నిధులు కేటాయించి నిర్మాణం వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, సంక్షేమ వసతిగృహాల్లో మెస్ చార్జీలు పెంచి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సభల్లో పలు తీర్మానాలు ఆమోదించారు. సభలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.మోహనరావు, శ్రీనివాస్, రాములు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment