అమిత్ షా గో బ్యాక్
● ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్ష
పార్టీల నిరసన
విజయనగరం పూల్ బాగ్: అంబేడ్కర్‌పై అనుచితమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడ పర్యటనను నిరసిస్తూ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సీపీఎం, సీపీఐలు ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సీపీఐ(ఎంఎల్)జిల్లా నాయకుడు బెహరా శంకరరావులు మాట్లాడుతూ..రాజ్యాంగాన్ని, అవమా నించి, అంబేడ్కర్‌పై అనుచితమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నైతికంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నా కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షా రాష్ట్రానికి వస్తే టీడీపీ, జనసేన నేతలు స్వాగతం పలకడం సిగ్గు చేటన్నారు. ప్రజలంతా అమిత్ షా పర్యటనను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వామపక్షాల నాయకులు రెడ్డి శంకరరావు, టీవీ రమణ, ఎం. అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment