● ఎస్పీ వకుల్ జిందల్
విజయనగరం క్రైమ్: జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠినచర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ మందుబాబులను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మాట్టాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మందు తాగే వారిపై చట్టప్రకారం చర్యలు చేపట్టేందుకుగాను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని తెలిపారు. లేఅవుట్లు, గ్రామ, నగర శివారు ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై దాడులు చేసి ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్న 252 మందిపై కేసులు నమోదుచేశామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఆకస్మికంగా వాహన తనిఖీలను చేపట్టి, పశువులను, మద్యం అక్రమంగా తరలిస్తున్న వారిపై రెండు కేసులు నమోదుచేసి, ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి 8 మద్యం బాటిల్స్, నాలుగు పశువులు, ఒక వ్యాన్ సీజ్ చేశామన్నారు. వాహన తనిఖీల్లో రహదారి భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 386 కేసులు నమోదుచేసి, రూ. 95 వేల 205 ఈ చలానా విధించామని తెలిపారు. సంతకవిటి పోలీస్‌స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై దాడులు చేసి, నలుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.16వేల 80 రూపాయలు నగదు సీజ్ చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment