31 వరకు పశు ఆరోగ్య శిబిరాలు
● పశు సంవర్థకశాఖ జేడీ వై.వి.రమణ
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఈ నెల 31వరకు కొనసాగనున్న పశు ఆరోగ్య శిబిరాలను పాడి రైతులు వినియోగించుకోవాలని పశు సంవర్థకశాఖ జేడీ వై.వి.రమణ కోరారు. గాజులరేగలో నిర్వహించిన పశు వైద్య శిబిరాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశువులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా శిబిరాలకు వచ్చే వైద్యులకు తెలియజేస్తే పరీక్షలు చేసి మందులు అందజేస్తారన్నారు. చూడి తనిఖీలు, గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేస్తున్న ట్టు వెల్లడించారు. కార్యక్రమంలో గొర్రెలు, మేకల సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు మన్యాల కృష్ణ, వెటర్నరీ పాలీక్లినిక్ డీడీ డాక్టర్ జి.మహాలక్ష్మి, ఏడీ డాక్టర్ రామప్రసాద్, వెటర్నరీ పోలీక్లినిక్ సహాయ సంచాలకుడు డాక్టర్ టి.ధర్మారావు, డాక్టర్ మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
19 మంది ఖైదీల విడుదలకు చర్యలు
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి
విజయనగరం క్రైమ్: బెయిల్ లభించే అవకాశం ఉన్నా పూచికత్తుదారులు లేని కారణంగా జైల్లోనే ఉంటున్న రిమాండ్ ఖైదీల విడుదల అంశాన్ని సమీక్షించినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. జిల్లా కోర్టు హాల్‌లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.వి.రాజేష్ ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ న్యాయసేవాధికార సంస్థ త్రైమాసిక అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సమావేశం జరిగింది. బెయిల్ లభించినా పూచీకత్తు లేని కారణంగా జైల్లోనే ఉండిపోయిన 19 మంది ముద్దాయిల వివరాలను సేకరించారు. వారికోసం మోడిఫికేషన్ పిటీషన్లు వేసి విడుదల చేసే అంశంపై చర్చించారు. సమావేశంలో జిల్లా మొదటి అదనపు న్యాయ మూర్తి ఎం.మీనాదేవీ, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాస్, పార్వతీపురం జిల్లా జేసీ ఎస్.శోభిక, మన్యం జిల్లా అదనపు ఎస్పీ దిలీప్ కిరణ్, డీటీసీ డీఎస్పీ వీరకుమార్, సబ్ జైళ్ల అధికారి జి.మధుబాబు, ప్రాసిక్యూషన్ డిప్యూ టీ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు.
నేటి నుంచి జేఈఈ పరీక్షలు ప్రారంభం
విజయనగరం అర్బన్: జేఈఈ తొలివిడత పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కాను న్నాయి. ఈ ఏడాది బీఆర్క్, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు 5,550 మంది పరీక్ష రాయనున్నారు. అయాన్ డిజిటల్ జోన్‌లో 4,571 మంది, ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 979 మంది పరీక్షకు హాజరుకానున్నారు. రెండు కేంద్రాల్లో ఈ నెల 22, 23, 24, 28, 29, 30 తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష జరగనుంది. ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండు షిఫ్టులుగా జరగనున్నవి.
రోడ్ల మరమ్మతు పనులు
పూర్తి చేస్తాం
విజయనగరం అర్బన్: జిల్లాలో చేపడుతున్న రోడ్ల మరమ్మతుల పనులను జనవరి నెలాఖరుకు పూర్తిచేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆ దిశగా జిల్లా అధి కారులు పనిచేయాలని సూచించారు. జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమీక్షించారు. భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. మంత్రి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కనీసం 20 ఎకరాలకు తక్కువ లేకుండా తహసీల్దార్లు ప్రభుత్వ స్థలాన్ని గుర్తిస్తే ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కిమిడి కళావెంకటరావు, కోళ్ల లతికుమారి, కోండ్రు మురళీమోహన్, అతిథి గజపతి, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ యశస్విని, జేసీ సేతుమాధవన్, ఆర్‌డీఓలు కీర్తి, రామ్మోహనరావు, సత్యవాణి, వివిధ విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment