ఓడీఎఫ్ ప్లస్ జిల్లాగా తీర్చిదిద్దుదాం
విజయనగరం అర్బన్: జిల్లాను మార్చి నెలాఖరుకు ఓడీఎఫ్ ప్లస్‌గా తీర్చిదిద్దాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఓడీఎఫ్ ప్లస్‌పై తన చాంబర్లో మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని 925 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే 74 గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్‌గా తీర్చిదిద్దామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, ఇతర అన్ని ప్రభుత్వ భవనాల్లో మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఉండాలన్నారు. జిల్లావ్యాప్తంగా 197 సామాజిక మరుగుదొడ్లు ఉన్నాయని, వీటికి అదనంగా 530 మంజూరు చేసినట్టు వెల్లడించారు. వీటిలో ఇప్పటి వరకు 83 పూర్తి అయ్యాయని, ప్రగతిలో ఉన్న 250 మరుగుదొడ్లను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కేంద్రం నుంచి డీపీఓ టి.వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment