సర్వే సిబ్బంది సామూహిక సెలవు
విజయనగరం అర్బన్: సర్వే ఉద్యోగుల సంఘం నాయకుడిపై ఇచ్చిన సరెండర్ ఆదేశాలను వెనుకకు తీసుకోవాలని, ఉద్యోగులకు ఇచ్చిన మెమోలను రద్దు చేయాలని కోరుతూ సర్వే శాఖ సిబ్బంది మంగళవారం సామూహిక సెలవుపెట్టారు. విధుల బహిష్కరించి ఉన్నతాధికారుల వేధింపులపై నిరసన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మండల, విలేజ్, సచివాలయ సర్వేయర్లు, టెక్నికల్ స్టాఫ్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్లు దాదాపు 485 మంది విధులు బహిష్కరించారు. దీంతో జిల్లాలో సర్వే శాఖ పనులు క్షేత్రస్థాయిలో స్తంభించాయి. సంఘ కార్యాలయం వద్ద నిర్వహించిన అత్యవసర సమావేశానికి భారీ సంఖ్యలో సర్వే ఉద్యోగులు హాజరై నిరసన తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల తీరుకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా పలువురు సర్వే సిబ్బంది మాట్లాడుతూ సంఘ అధ్యక్షుడు చౌదరి వెంకట్రావు సరెండర్ అదేశాలను వెనక్కి తీసుకోవాలని, మండల సర్వేర్లకు ఇచ్చిన మెమోలను, ఇద్దరు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లకు, ఐదుగురు సర్వేయర్లకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను రద్దు చేసే వరకు సామూహిక సెలవుల రూపంలో విధులు బహిష్కరిస్తామని ప్రకటించారు. పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జల్లా సంఘం కమిటీలు మా నిరసనకు మద్దతుగా నల్లబ్యాడ్డీలతో విధులు నిర్వహించారన్నారు. సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి మద్దతు వస్తుందని హెచ్చరించారు. జిల్లాలోని వీఆర్వోల సంఘం, ఏపీఎన్‌జీఓ సంఘాలు మద్దతు అడగడం జరిగిందని తెలిపారు. అనంతరం వినతి పత్రాలను ఉన్నతాధికారులకు పంపామని ప్రకటించారు.
స్తంభించిన రీ సర్వే సమస్యల సవరణ క్రియ
Comments
Please login to add a commentAdd a comment