ఆమె నేత్రాలు సజీవం
● మృతిచెందిన 85 ఏళ్ల వృద్ధురాలి నుంచి నేత్రాల సేకరణ
రాజాం సిటీ: ఆమె మరణించినప్పటికీ ఆ కళ్లు ప్రపంచాన్ని చూడగలవు. అన్ని అవయవాల్లోకి నయనం ప్రధానం అని నమ్మిన కుటుంబసభ్యులు నేత్రదానానికి ముందుకు వచ్చారు. మున్సిపాల్టీ పరిధి అమ్మవారికాలనీకి చెందిన చెక్కా ఇందుమతి (85) ఆదివారం వేకువజామున మృతిచెందారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు రాజాం రెడ్‌క్రాస్ సభ్యులు కొత్తా సాయిప్రశాంత్‌కుమార్, పెంకి చైతన్యకుమార్‌ల ద్వారా రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహనరావుకు తెలియజేశారు. దీంతో స్పందించిన ఆయన మగటపల్లి కల్యాణ్ నేత్రసేకరణ కేంద్రం టెక్నీషియన్ పూతి సుజాత, ఉమల ద్వారా ఆమె నేత్రాలను సేకరించారు. ఈ సందర్భంగా రాజాం రెడ్‌క్రాస్ సభ్యులు మాట్లాడుతూ నేత్రదానం మహాదానమని, ప్రతి ఒక్కరికీ కుటుంబ సంప్రదాయం కావాలని పిలుపునిచ్చారు. ఒకరి నేత్రాలు ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపుతాయని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో నేత్రదానంపై అవగాహన పెరుగుతోందన్నారు. అంధత్వ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమవంతు కృషిచేయాలని కోరారు. నేత్రదానానికి ముందుకు వచ్చిన చెక్క గున్నరాజు, ఎ.భాస్కర్, అరుణ, రమణమ్మలను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment