విజయనగరం
సోమవారం శ్రీ 20 శ్రీ జనవరి శ్రీ 2025
యూరియా కరువు
ప్రతి ఏడాదీ యూరియా సమస్య రైతులను వెంటాడుతోంది. రెతులకు యూరియా పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. –8లో
ఆరుగాలం కష్టించి పండించిన పంట దిగుబడుల విక్రయంలో అన్నదాత నిలువు దోపిడీకి
గురవుతున్నాడు. దీన్ని అరికట్టాల్సిన
అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ధాన్యం విక్రయంలో రైతులను మిల్లర్లు
దోచుకుంటున్నారు. ఈ విషయం రైతుల ముందే
జరుగుతున్నా... ఏమీ అడగలేని నిస్సహాయ స్థితి వారిది. అడ్డుకోవాల్సిన అధికారులు కూడా ఏం పోయిందిలే.. అన్నట్టు సమాధానపరిచే పరిస్థితి. ధాన్యం కొనుగోలు విషయంలో కూటమి సర్కార్ చెబుతున్న మాటలకు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలకు అస్సలు పొంతన ఉండడం లేదు.
మేలు మాని నిర్లక్ష్యంతో
కీడు చేశారు..
బొబ్బిలి: అలవి కాని హామీలనిచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీల అమలుతో మేలు చేస్తుందనుకుంటే.. వైకుంఠ దర్శన టిక్కెట్ల జారీ ప్రక్రియలో నిర్లక్ష్యంతో భక్తులు మృతి చెందేలా కీడు చేసిందని రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు ధ్వజమెత్తారు. ఆదివారం సంఘ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. టిక్కెట్ల జారీలో భద్రతా ఏర్పాట్లలో తీవ్ర నిర్లక్ష్యంతో ఆరుగురు భక్తుల మృతితో పాటు దాదాపు 60 మంది గాయాల పాలవడానికి కారణమయిన ప్రభుత్వ యంత్రాంగానికి వారి నిర్లక్ష్యం ఎలా తెలిసివస్తుందోనని అన్నారు. అంతే కాకుండా ఇటీవల బాలుడు మేడ పైనుంచి పడి మృతి చెందడంతో పాటు తిరుమల కొండపై నకిలీ టిక్కెట్ల దందాలు, మాంసాహారాలు పెచ్చుమీరుతున్నాయన్నారు. సనాతన ధర్మం అంటూ ప్రచారం చేసుకుంటే సరిపోతుందా.. ఆయన ప్రశ్నించారు. మరోవైపు సంక్షేమ పథకాలు మంజూరు కాక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని వాపోయారు. ప్రజలకు సంక్షేమం లేకపోగా మరింతగా అవస్థలు పెరుగుతున్నాయన్నారు. ఇది ఏపీ ప్రజలు చేసుకున్న కర్మఫలంలా ఉందని ఎద్దేవా చేశారు. ఆయనతో పాటు రాంబార్కి తిరుపతిరావు, కేశవరావు పాల్గొన్నారు.
న్యాయం కోసం
దరఖాస్తు చేసుకోవచ్చు
బొబ్బిలి: రిమాండ్ ఖైదీలు తమకు న్యాయం జరగలేదని భావిస్తే న్యాయం కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు, న్యాయం పొందే అవకాశం భారత న్యాయ వ్యవస్థలో ఉందని సీనియర్ సివిల్ జడ్జి ఎస్ అరుణశ్రీ అన్నారు. ఆదివారం ఆమె తన సిబ్బందితో కలసి స్థానిక సబ్‌జైలును సందర్శించారు. అక్కడి రిమాండ్ ఖైదీలకు న్యాయ అవగాహన కల్పించారు.
డంకేషావలీబాబా
ఉరుసు ఉత్సవాలు
విజయనగరం టౌన్: నగరంలోని కోట జంక్షన్ వద్దనున్న డంకేషావలీబాబా ఉరుసు ఉత్సవాలలో భాగంగా ఆదివారం పురవీధుల్లో ర్యాలీలు నిర్వహించారు. బాబాకు ప్రత్యేక పూజలు చేశారు. దర్గా వంశపారంపర్య సేవకులు ఖాదమ్ షేక్ బహుదూర్ షేక్ షాజహాన్ ఆధ్వర్యంలో బాబాకు చందనోత్సవం గంధ మహోత్సవాలను నిర్వహించారు. 350 ఏళ్ల చరిత్ర కలిగిన బాబా దర్గాను ఆదివారం కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు అబ్దుల్ కరీమ్, విద్యాసాగర్, శ్రీనివాస్, సతీష్ రెహమాన్ తదితరులు దర్శించుకున్నారు.
● రైతుల నెత్తిన కుచ్చుటోపి
● అదనంగా ధాన్యం వసూలు
● 40 కేజీల బస్తాకు 41 కేజీలు
తీసుకుంటున్న వైనం
● 80 గ్రాముల సంచికి అదనంగా
2 కేజీలు తీసుకుంటున్న మిల్లర్లు
● అన్ని మిల్లుల వద్ద ఇదే పరిస్థితి
● ఆర్‌బీకే సిబ్బంది మిల్లర్లకు సహకరిస్తున్నట్టు విమర్శలు
● ఇప్పటి వరకు 2,86,842 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
●గంట్యాడ మండలానికి చెందిన పీవై నాయుడు అనే రైతు అదే మండలంలో ఉన్న రైస్ మిల్లుకు 8435 కేజీల ధాన్యం తీసుకువెళ్లాడు. 40 కేజీల బస్తా చొప్పున 210 బస్తాలు రావాల్సి ఉండగా 205 బస్తాలకు
41 కేజీల బస్తా చొప్పున ట్రక్ షీట్ ఆర్‌బీకే సిబ్బంది కొట్టారు. దీంతో అతను 200 కేజీల ధాన్యం నష్టపోయాడు.
●జామి మండలానికి చెందిన రామచంద్రరావు అనే రైతు గంట్యాడ మండలంలోని ఓ మిల్లుకు ధాన్యం తీసుకుని వెళ్లాడు. మిల్లులో ఉన్న వే బ్రిడ్జి వద్ద తూకం వేయగా 179 బస్తాలు(40 కేజీలవి) వచ్చాయి. కానీ 82 కేజీల చొప్పున 175 బస్తాలకు మాత్రమే ఆర్‌బీకే సిబ్బంది ట్రక్ షీట్ కొట్టారు. దీని వల్ల అతను 160 కేజీల ధాన్యం
నష్టపోయాడు.
విజయనగరం ఫోర్ట్:
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం విక్రయించిన రైతులు దోపిడీకి గురవుతున్నారు. అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కూటమి సర్కార్ గొప్పులు చెబుతుంది. కానీ తాము దగాకు గురవుతుంటే పట్టించుకునే నాధుడే కరువయ్యాడని అన్నదాత ఆవేదన చెందుతున్నాడు. నిబంధనల ప్రకారం 40 కేజీల ధాన్యం సంచి పేరిట యాజమానులు రైతులను దోచేస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం 80 గ్రాముల గోనె సంచిని బూచిగా చూపి రైతులు నుంచి అదనంగా 2 కేజీలు వసూలు చేస్తున్నారు. అధికారులు సైతం 2 కేజీలే కదా లైట్ తీసుకోండి అంటూ చెప్పడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది పెద్ద సమస్యే కాదని ఓ అధికారి చెప్పారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
2,86,842 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
జిల్లాలో 483 ధాన్యం కొనుగోలు కేంద్రాల(రైతు సేవా కేంద్రాలు) ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 3,19,424 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలుకు షెడ్యూల్ ఇచ్చారు. వీటిలో ఇప్పటి వరకు 2,86,842 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసారు. షెడ్యూల్ ప్రకారం ఇంకా 32,582 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందులో 2,79,446 మెట్రిక్ టన్నుల ధాన్యానికి ట్రక్ షీట్ జనరేట్ చేసారు. ఇంకా 7,396 మెట్రిక్ టన్నుల ధాన్యానికి ట్రక్ షీట్ జనరేట్ చేయాల్సి ఉంది.
80 కేజీల బస్తాకు 2 కేజీల చొప్పున దోపిడీ
80 గ్రాములు ఉండే గోనె సంచిలో ధాన్యం నింపి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా తరలిస్తున్నారు. 80 కేజీల బస్తాకు మిల్లు యాజయానులు 2 కేజీలు అదనంగా 82 కేజీలు చొప్పున తీసుకుంటున్నారు. దీని వల్ల రైతులు వేలాది రుపాయిలు నష్టపోతున్నారు. రైతులకు మేలు చేయాల్సిన అధికారులు చూసీ చూడనట్టు వ్యవహారిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
● సమీపిస్తున్న పదో తరగతి పరీక్షలు
● విద్యార్థులకు చేరని స్టడీ మెటీరియల్
● పీడీఎఫ్ కాపీ ఇచ్చి ప్రింట్
తీయించుకోవాలంటున్న అధికారులు
● విద్యార్థులపై అదనపు భారం
● ఆరు సబ్జెక్టులు
● ఏడు ప్రశ్న పత్రాలుగా పరీక్షలు
● నామమాత్రంగా ప్రత్యేక తరగతులు
● మారిన ప్రశ్న పత్రాలపై సాధన చేయలేని విద్యార్థులు
● ఉత్తీర్ణత శాతంపై అధికారుల్లో ఆందోళన
న్యూస్‌రీల్
అదనంగా తీసుకోకూడదు..
గోనె సంచి బరువు ఎంత ఉంటే అంతే ధాన్యం అదనంగా తీసుకోవాలి. ఈ మేరకు అన్ని రైతు భరోసా కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసాం. మరోసారి ఆదేశాలు ఇస్తాం. రైతుల నుంచి అద నంగా ధాన్యం తీసుకుంటే చర్యలు తీసుకుంటాం. – వి.తారకరామారావు,
జిల్లా వ్యవసాయ అధికారి
Comments
Please login to add a commentAdd a comment