వనపర్తి వాసికి అరుదైన గౌరవం | Sakshi
Sakshi News home page

వనపర్తి వాసికి అరుదైన గౌరవం

Published Wed, May 15 2024 1:20 AM

వనపర్

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఆహ్వానం

వనపర్తిటౌన్‌: జిల్లాకేంద్రానికి చెందిన ఉప్పుగంటి రాఘవేందర్‌కు ఈ నెలలో ఫ్రాన్స్‌లో జరిగే కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. తాను ఎడిటింగ్‌ చేసిన ‘ఇన్‌రీట్రీట్‌’ అనే 1.15 గంటల చిత్రం ఫెస్టివల్‌లో ప్రదర్శించడానికి ఎంపిక కావడంతో ఈ మేరకు నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రదర్శించబడుతున్న చిత్రంగా ఇన్‌రీట్రీట్‌ నిలవనుంది. రాఘవేందర్‌ పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్ట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో పీజీ డిప్లొమా పూర్తిచేశారు. అదే కళాశాలలో చదివిన మైసమ్‌అలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. రాఘవేందర్‌ ఎడిటింగ్‌ చేశాడు. నాలుగు నెల ల కిందట ఆన్‌లైన్‌ వేదికగా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ఏప్రిల్‌ 15న అనుమతి లభించిందని.. ఈ నెల 20న చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా రాఘవేందర్‌ను పట్టణంలోని సాహితీవేత్తలు, ప్రజాసంఘాల నాయకులు అభినందించారు.

స్ట్రాంగ్‌రూముల్లో

ఈవీఎంలు భద్రం

నాగర్‌కర్నూల్‌: నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానానికి సోమవారం నిర్వహించిన ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎంలను మంగళవారం జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని స్ట్రాంగ్‌రూములకు తరలించారు. ఈసందర్భంగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. పార్లమెంట్‌ నియోజకవర్గంలోని నాగర్‌కర్నూల్‌, కల్వకురి, అచ్చంపేట, కొల్లాపూర్‌, వనపర్తి, అలంపూర్‌, గద్వాల అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంలను ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ రుచేష్‌ జైవన్షీ, పలువురు అభ్యర్థుల సమక్షంలో సీల్‌వేసి స్ట్రాంగ్‌రూముల్లో భద్రపర్చినట్లు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌రూముల వద్ద సీఆర్‌పీఎఫ్‌, పోలీసు సిబ్బందితో మూడంచెల భద్రత నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. అనంతరం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అభ్యర్థులతో ఎన్నికల అధికారులు సమావేశమై పోలింగ్‌ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పలు పోలింగ్‌ కేంద్రాల పీఓ డైరీ, 17సీ 17 ఫార్మేట్లను జనరల్‌ అబ్జర్వర్‌ పరిశీలించి, ఓటింగ్‌ వివరాలను వెల్లడించారు. పోలింగ్‌ ప్రక్రియ జరిగిన విధానంపై అభ్యర్థులు సంతృప్తిని వ్యక్తంచేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కుమార్‌ దీపక్‌, కె.సీతారామారావుతో పాటు గద్వాల, వనపర్తి జిల్లాల అదనపు కలెక్టర్లు, ఏఆర్‌ఓలు ఉన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రస్తుత 2024– 25 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల వారు వివిధ ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల్లో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి పాండు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వనపర్తి వాసికి  అరుదైన గౌరవం
1/1

వనపర్తి వాసికి అరుదైన గౌరవం

Advertisement
 
Advertisement
 
Advertisement