సంస్థాగతంగా బలోపేతమే లక్ష్యం : బీజేపీ
వనపర్తిటౌన్: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనపై ప్రజలు విసుగ్గెత్తి ఉన్నారని.. సంస్థాగతంగా బలోపేతమైతే స్థానిక ఎన్నికల్లో సత్తాచాటడం ఖాయమని బీజేపీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఓ గార్డెన్స్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అధ్యక్షతన సంస్థాగత నిర్మాణంపై వర్క్‌షాప్ నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సభ్యత్వాల నమోదులో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ నియోజకవర్గాల తర్వాత వనపర్తి అగ్రస్థానంలో ఉందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేసేందుకు ఇదే ఉత్సాహంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 25లోపు బూత్, మండలస్థాయి కార్యవర్గాల ఎన్నిక పూర్తి చేయాలని, 15లోగా బూత్‌లు, మండలాల వారీగా వర్క్‌షాప్‌లు పూర్తి చేయాలని సూచించారు. 200 సభ్యత్వాలు కలిగిన ప్రతి పోలింగ్ బూత్‌లో ఇద్దరు క్రియశీలక సభ్యులు, 21 మందితో బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని, ప్రతి కమిటీలో మహిళలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉండేలా చూడాలన్నారు. సంస్థాగతంపై దృష్టి సారిస్తే వచ్చే రోజుల్లో రాష్ట్రంలోనూ పార్టీ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సభ్యత్వ ఇన్‌చార్జ్ వేముల నరేందర్‌రావు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు సబ్బిరెడ్డి వెంకట్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, అసెంబ్లీ సభ్యత్వ ఇన్‌చార్జ్ మున్నూర్ రవీందర్, నాయకులు పురుషోత్తంరెడ్డి, బి.శ్రీశైలం, మాధవరెడ్డి, సుమిత్రమ్మ, సీతారాములు, ఆర్.వెంకటేశ్వర్లు, ఎం.చెన్నయ్య, శివారెడ్డి, బి.రాము, శ్రీనివాస్‌గౌడ్, పెద్దిరాజు, మణివర్ధన్, కల్పన తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment