బహుభాషా కోవిదుడు ఆజాద్
వనపర్తి టౌన్: స్వాతంత్య్ర సమరయోధుడు మౌలాన అబుల్ కలాం ఆజాద్ బహుభాషా కోవిదుడని.. భారతీయ సంస్కృతి నిపుణుడిగా చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయారని కాంగ్రెస్‌పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అక్తర్ కొనియాడారు. సోమవారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయం ఎదుట మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నిర్వహించగా ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. కవిగా, రచయితగా, తత్వవేత్తగా, రాజకీయ, విద్యావేత్తగా పేరొంది తొలి విద్యాశాఖ మంత్రిగా సేవలందించిన భారతరత్నం ఆజాద్ అన్నారు. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమానికి నడుం బిగించారని, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ పదేళ్లు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. అతి సంపన్న కుటుంబంలో పుట్టినా.. దేశభక్తిని ఏనాడు వదులుకోకుండా దేశ స్వాతంత్య్రం కోసం అహర్నిశలు పాటు పడ్డారని వివరించారు. జాతీయ సమైఖ్యతకు కులమతాలకు అతీతంగా పోరాడిన నాటి స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తి నేటితరానికి అవసరమని పేర్కొన్నారు. అదేవిధంగా మహనీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో అబుల్ కలాం ఆజాద్ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కదిరె రాములు, ఓబీసీ జిల్లా చైర్మన్ కోట్ల రవి, నాయకులు కమర్‌మియా, అనీస్, బాబా, సమద్, రాగి వేణు, పెంటన్న యాదవ్, నాగరాజు, వెంకటేష్, ఇర్షద్, భాస్కర్, మహనీయుల స్ఫూర్తివేదిక రాష్ట్ర కన్వీనర్ రాజారాంప్రకాశ్, ప్రతినిధులు గిరిరాజాచారి, నాయకంటి నరసింహశర్మ, మండ్ల దేవన్న, నాగరాజు, బాలేమియా, కిరణ్, రాము, రమేశ్‌చారి, మురళీధర్‌చారి, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment