రుణమాఫీ కాలే.. కొత్త లోన్ ఇవ్వలే..
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామానికి చెందిన కె.వెంకటయ్య. ఈయనకు 1.5 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. మూడేళ్ల క్రితం పోల్కంపల్లి సింగిల్ విండోలో రూ.45 వేల పంట రుణం తీసుకున్నాడు. ఎన్నికలకు ముందు వడ్డీ కట్టమని సింగిల్ విండో అధికారులు ఒత్తిడి తెచ్చారు. డబ్బులు లేక కట్టలేకపోయాడు. ఇటీవల ప్రభుత్వం రుణమాఫీ చేయగా వెంకటయ్యకు కాలేదు. పాత బకాయి మాఫీ కాకుండా అలాగే ఉండిపోవడంతో కొత్తగా పంట రుణం ఇవ్వలేదు. దీంతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పు చేసి.. పంట సాగు చేస్తున్నానని ఆ రైతు వాపోతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment