జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): స్థానిక సంస్థల వారీగా కల్పించే అవసరమైన రిజర్వేషన్ల దమాషా పేర్కొనే విషయంపై సోమవారం మహబూబ్నగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో డెడికేటెడ్ బీసీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్ బుసాని వెంకటేశ్వరరావు, కార్యదర్శి బి.సైదులు హాజరవుతారన్నారు. ఆయా కులాల స్థితిగతులపై డెడికేటెడ్ బీసీ కమిషన్కు అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చన్నారు. స్థానిక సంస్థలకు అవసరమైన రిజర్వేషన్లను దమాషా ప్రకారం కల్పించేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీలు, బీసీ సంఘాలు, ప్రజలు సలహాలు, అభ్యర్థనలు, ఆక్షేపణలను కమిషన్కు సమాచారం, మెటీరియల్, సాక్ష్యాలతో సమర్పించవచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment