బాలికా సాధికారత క్షబ్‌లు
జిల్లాలోని 100 పాఠశాలల్లో ఏర్పాటు
● బాలికల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం
● ప్రధానోపాధ్యాయుడి పర్యవేక్షణలో సభ్యుల నియామకం
అమరచింత: బాలికల హక్కుల రక్షణకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు రూపొందించాయి. పాఠశాల స్థాయిలో వారి హక్కుల పరిరక్షణకు బాలికా సాధికారత క్షబ్‌లు ఏర్పాటు చేస్తుండగా.. గతేడాది ఎంపిక చేసిన క్లబ్‌ల కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాదికి సంబంధించి కొత్త వాటి ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలోని 100 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ క్షబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపడంతో రెండ్రోజులుగా కమిటీల ఎంపికకు తగిన కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రభుత్వ బాలికల పాఠశాలే కాకుండా కో–ఎడ్యుకేషన్ పాఠశాలల్లో సైతం ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాలికల చదువుతో పాటు సమాజంలో ఎలా ఉండాలనే విషయాలను క్షబ్‌ల ద్వారా విద్యార్థినులకు వివరించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏళ్లుగా క్లబ్‌లను ఏర్పాటుచేస్తూ బాలికల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు.
క్లబ్‌ల ఏర్పాటు ఇలా..
బాలికా సాధికారత క్షబ్‌లో చైర్మన్‌గా ప్రధానోపాధ్యాయుడు, కన్వీనర్‌గా మహిళ ఉపాధ్యాయురాలు, సభ్యులుగా 10 నుంచి 12 మంది బాలికలతో పాటు ఇద్దరు చురుగ్గా ఉండే బాలికలను తీసుకుంటారు. స్థానిక షీటీం ఇన్‌చార్జ్‌తో కలిపి క్షబ్ ఏర్పాటు చేస్తారు.
అవగాహన కల్పించే అంశాలు..
గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, ఈవ్‌టీజింగ్, బాల్య వివాహాల నియంత్రణ, మహిళలు, బాలికలపై హింస, ప్రేక్షకుల జోక్యం, లైఫ్ స్కిల్స్‌పై అవగాహన. ఆయా అంశాలపై జిల్లాస్థాయి కన్వర్జెన్స్ చైర్మన్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్‌మెంట్ విద్యార్థులకు అవగాహన
కల్పిస్తుంది.
బాలిక సాధికారతపై ప్రత్యేక దృష్టి..
జిల్లాలోని 100 ప్రభుత్వ పాఠశాలల్లో బాలికా సాధికారత క్షబ్‌ల ఏర్పాటుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రభుత్వ ఉత్తర్వులను ఆయా పాఠశాలలకు పంపించి కమిటీల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నాం. బాలికా సాధికారితపై శ్రద్ధ చూపడం, వారికి ఎలాంటి హాని కలగకుండా క్లబ్‌ల ద్వారా న్యాయం చేస్తాం. – శుభలక్ష్మి, జీసీడీఓ
క్లబ్‌ల ఏర్పాటు ఉద్దేశం..
బాలికలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు, చెడు ప్రవర్తనను గుర్తించడానికి ఓ యంత్రాంగాన్ని రూపొందించడం.
సకాలంలో జోక్యం చేసుకొని నేరాన్ని నిరోధించడం.. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయడం.
పాఠశాల, స్థానిక పోలీసుల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం.
యుక్త వయసు బాలికల విద్య, ఎదుగుదలలో మార్పులు, ఆరోగ్యం, పరిశుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పించడం.
యుక్త వయసు బాలికలు తమ సమస్య స్పష్టంగా చెప్పడం, హక్కులు తెలుసుకోవడం, అనుమానం.. భయాన్ని ఎదుర్కోవడం, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం, సమాజంలో బాధ్యత వహించే సామర్థ్యాలను అభివృద్ధి చేయడం.
Comments
Please login to add a commentAdd a comment