సాగుయోగ్యం కాని భూములను గుర్తించాలి
కొత్తకోట రూరల్: వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగిన అన్నదాతలకు రైతుభరోసా పథకంతో లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని.. సాగుయోగ్యంకాని భూములను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయా లని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపిక కోసం చేపట్టిన సర్వేపై ఆదివారం కొత్తకోట మున్సిపల్ కార్యాలయంలో మండలస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించా రు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని దండుగడ్డ ప్రాంతంలో సాగుయోగ్యం కాని భూములతో పాటు ఇప్పటికే లేఅవుట్లుగా మారిన భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ సర్వే నంబర్ల ఆధారంగా సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి వ్యవసాయానికి యోగ్యం కాని భూముల గుర్తింపు ప్రక్రియను ముమ్మరం చేయాలన్నారు. ఇందుకు తహసీల్దార్, వ్యవసాయాధికారులు, మున్సిపల్ కమిషనర్ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పూర్తయిన సర్వే ఆధారంగా జాబితా సూపర్ చెక్ చేసి, నిజమైన అర్హులను గుర్తించాలని తెలిపారు. సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ రామమహేశ్వర్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ చెన్నమ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment