ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కోసం మంగళవారం జిల్లావ్యాప్తంగా 137 గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభలు విజయవంతమైనట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి వెల్లడించారు. గ్రామసభల నిర్వహణ, సమస్యలపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎకై ్సజ్, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. పథకాల వారీగా లబ్ధిదారులు, అభ్యంతరాలు, కొత్త దరఖాస్తులు, ఆమోదం వివరాలను వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, జి.వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment