ప్రత్యేక అవసరాల చిన్నారులకు స్పీచ్ థెరపీ
వనపర్తి విద్యావిభాగం: ప్రత్యేక అవసరాల చిన్నారుల కోసం ప్రతి మండల కేంద్రంలో వారంలో ఒకరోజు ఫిజియో, స్పీచ్ థెరపీ శిబిరాలు నిర్వహిస్తామని.. సద్వినియోగం చేసుకొని సమస్యలను అధిగమించాలని ఐఈ కో–ఆర్డినేటర్ యుగంధర్ కోరారు. మంగళవారం ఆయన జిల్లాకేంద్రం కేడీఆర్‌నగర్‌లోని భవిత కేంద్రాన్ని సందర్శించి కొనసాగుతున్న స్పీచ్ థెరపీ క్యాంపును పరిశీలించారు. అదేవిధంగా ప్రత్యేక అవసరాల విద్యార్థుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్పీచ్ థెరపీస్ట్ రమేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment